
కథ
- saidurga26366
- Jun 11, 2024
- 1 min read
Updated: Jun 14, 2024
భూమి మీద ఎంత మంది ఉన్నారో అన్నికతలు ఉన్నాయి.
కొన్ని మంచి కథలు.
కొన్ని చెడ్డ కథలు ఉన్నాయి.
కొన్ని పేదవారి కథలు.
కొన్ని ధనవంతుల కథలు.
కొన్ని తెలివి గల కథలు కొన్ని తెలివి తక్కువ కథలు ఉన్నాయి.
కొన్ని దైర్యం గల కథలు ఉంటే కొన్ని పిరికి వాని కథలు ఉన్నాయి.
కొన్ని ప్రేమ కథలు
కొన్ని విరహ వేదన కథలు ఉన్నాయి.
డబ్బు ఉంటే ప్రేమ ఉండే కాలం కథలు ఉన్నాయి.
కథ వింటే ,చదువుతే ఒకరకంగా ఉంటే అనుభవిస్తూ ఉంటే ఇంకో రకంగా ఉంటుంది.
జీవిత గాథలు ఎన్నో ఉన్నాయి.
జీవిత కథలో వీరోచిత పోరాటాలు.గెలుపు ఓటములు ఉంటాయి.
భరిస్తూ ఓర్చుకుంటూ ముందుకు పోవడం జీవిత కథలో ఎక్కువ గా ఉంటాయి.
మనిషి భూమి మీద పుట్టింది మంచి చెడులను అనుభవించడానికి.
సంతోషాన్ని దుఃఖాన్ని అనుభవించడానికి.
జీవిత కథ ను తొందరగా ముగించడానికి కాదు.
ఈజీవిత ప్రయాణం ఎవరిది ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలువద....
నీ జీవిత కథలో మంచిని చూపించు.
దయను చూపించు.
ప్రేమను చూపించు.
నీ నవ్వును చూపించు.
నీ సహాయాన్ని చూపించు.
నీకంటి నీరును చూపించకు.
నీ బాదను చూపించకు.

Comments