top of page

PART7. ఒక సైనికుడి జీవిత కథ

  • Writer: saidurga26366
    saidurga26366
  • Aug 5, 2024
  • 3 min read

నేను ఈ కథ రాయల వద్ద అని అనుకుంటూ కాలం గడుపుతున్నాను 15 రోజులు నుంచి. ఈ కథలో చాలా విషయాలను దాచి పెడుతూ కథ రాయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇది కథ కాదు కదా పూర్తిగా అని అనిపించింది. సరే కొన్ని విషయాలను ప్రపంచానికి నా కథ ద్వారా తెలియజేయవచ్చు కదా అని అనిపిస్తూ మళ్ళీ కథ రాయడానికి ముందుకు వచ్చాను.

గడచిన కథలో నా బాల్యము సూరారమను ఒక గ్రామంలో నా బాల్యము గడుస్తున్నది ఆ విషయాలను తెలియజేశాను. నా బాల్యము అందంగానే గడిచింది. నా బాల్యంలో మాకు మా పొలము దగ్గర ఒక మామిడి చెట్టు ఉండేది. అది తీయని మామిడి చెట్టు. ఆ చెట్టు కాయలు తీసుకొచ్చి మా దేవుని రూములో మామిడికాయలు పండబెట్టేది. ఆ కాయలను నేను తిని కొన్ని పైసలకు కూడా అమ్మేది. హోలీ పండుగకు అందరితో పాటుగా నేను జాజిరి ఆట ఆడటానికి వెళ్ళేది. ఆట ఆడుతూ ఉంటే నాకు కొంత సిగ్గుగా అనిపించింది. మా ఇంటి ముందుకు ఆడటానికి వచ్చినప్పుడు నేను ఇంట్లో పోయి వడ్లు తీసుకొచ్చి పోసినాను.

మేము ఓదెల జాతరకు పోయేది. నాకు ఇంకా గుర్తు గుడికి చీకట్లో ఉదయము నడుచుకుంటూ పోతుంటే అది నాకు ఇంకా గుర్తు వస్తున్నది. ఈ ఓదెల జాతర జమ్మికుంట దగ్గర ఉన్నది . గ్రామంలో మల్లికార్జున స్వామి దేవాలయం. ఆ జాతరలో నేను గజ్జల నెక్కర్ వేసుకుని ఎగిరేది. ఎగురుతూ చేతిలో తాడు పట్టుకునేది. అప్పుడు మా అవ్వ తో నేను ఉండేది.

కాలం ఆగదు ఎప్పుడూ ప్రయాణం చేస్తూనే ఉంటుంది అందులో మనం నడుస్తూనే ఉంటాము గమ్యం చేరేవరకు అన్నింటిని భరిస్తూ ముందుకు పోతూ ఉంటాము అదే జీవితం.

నా బాల్యంలో చాలా ఆటలు ఆడాను. అయితే నేను చిన్నప్పుడు మా గూట్లో

పైసలు ఉంటే కొన్ని పైసలు తీసుకొని కొనుక్కొని తినేది. కిరాణం షాపులో బెల్లము కొనుక్కొని చేతి మట్టపైన పెట్టుకుని నాకు తు తినేది. దీపావళి పండుగకు బాంబులు కాల్చేది. అప్పుడు రైక మడత అనే బాంబు లక్ష్మీ బాంబు కాకర వత్తులు పాములు భూ చక్రాలు విష్ణు చక్రాలు ఉండేవి. దీపావళికి మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసేవారు. ఆ వ్రతములో మా అవ్వ తాత మా అమ్మ నాయన మా చిన్నాన్న అదే మా శంకరన్న మా చిన్నమ్మ లు కూర్చునేది. నేను సత్యనారాయణ పీఠం దగ్గర కూర్చునేది అయితే ఆ కొబ్బరికాయలు కొట్టిన కొబ్బరి ముక్కలు తీసి గోధుమ పిండిలో కలిపి చెక్కర పోసి ఆ ప్రసాదాన్ని సత్యనారాయణ వ్రతం తర్వాత అందరికీ పంచేది. ఆ వ్రతానికి వాడలోని వారందరూ వచ్చేది నా స్నేహితులు కూడా వచ్చేది. మా తమ్ముళ్ల నా పక్కనే కూర్చునేది.నా స్నేహితులతో సాయంత్రం అయితే ఇంటి ముందు ఆటలు ఆడాను. గొరింక ఆట తొక్కుడు బిళ్ళలు గోలీలాటలు మామిడి పిక్క ఆటలు తాటి ముంజల ఆటలు బాణాలు పైసలు ఇవన్నీ ఆడేది.

ఆటలు ఆడుతూ జీవితం గడిపితే ఎంతో మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చూస్తున్నా ఎంతోమంది క్రీడాకారులు వారి జీవితాన్ని ఆటలలోనే గడుపుతున్నారు. ఆటలలో జీవితం గడపడం ఎంతో అదృష్టం. నేను హై స్కూల్ చదివేటప్పుడు నేను బాల్ బ్యాట్మెంటన్ ఆడేది మా తమ్ముడు ప్రవీణ్ తో. ఇప్పుడు చెస్ ఆడుతాను క్యారమ్స్ ఆడతాను సెల్లులో చెస్ ఆడుతాను .పాలిటెక్నిక్ చదివేటప్పుడు క్రికెట్ ఆడేది.

ఇప్పుడు ఉద్యోగం చేసే మా యూనివర్సిటీలో నేను టేబుల్ టెన్నిస్ ఆడతాను అప్పుడప్పుడు. కానీ ఎక్కువ శక్తి ని పెట్టలేక పోతాను. ఎందుకంటే నాకు గుండె ఆపరేషన్ అయింది బైపాస్ సర్జరీ అయింది.

మా అమ్మతో నేను మా అమ్మమ్మ గారి ఇంటికి పోయేది. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు హనుమకొండలో లష్కర్ బజార్లో ఉన్నది. అక్కడ కూడా నాకు స్నేహితులు ఉండేవారు. అక్కడ మా బామ్మర్ది సీన్ తొ గోలీల ఆట ఆడేది. బొంగురమాటాడేది. చిన్న చిన్న సైకిల్ తొక్కేది. మా చిన్న తాత కొడుకు రాజు మా స్నేహితుడే. వరసకు మామ అవుతాడు. మా పెద్దమ్మ బిడ్డ అనిత నాకంటే రెండు సంవత్సరములు పెద్దది. మా తమ్ముళ్ళతో వీరితో నేను చిన్నప్పుడు మా ఇంటి వెనకాల ఆడేది. మా అమ్మమ్మ ఇంటి వెనకాల పెద్ద రాళ్లచెట్టు ఉండేది. ఆ రాళ్ల చెట్టు కింద గోలీలు ఆడేది. హనుమకొండ లష్కర్ బజారులో నేను పతంగీ లు ఎక్కించేది . ఇప్పుడు నా వయసు 54 నర సంవత్సరములు. ఇప్పుడు కూడా పతంగిలు ఎక్కియ్యాలనిపిస్తుంది కానీ అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ మా యూనివర్సిటీలో పతంగీలు పెద్దవారు ఎవరు ఎక్కియరు. చిన్నపిల్లలు పతంగీలు ఆడతారు. నాకు ఇంకా గుర్తు నా చిన్నప్పుడు మొదటిసారి పతంగిని చూసేటప్పుడు మా తాత నాతో అంటున్నాడు పతంగిలు ఎగురుతున్నయిరా పాతంగిలు పైన ఎగురుతున్నాయి రా చూడు అని. తరువాత నేను పతంగిలి తయారు చేశాను బుక్కులోని పేపర్తో ఒక్కొక్కసారి న్యూస్ పేపర్ తో కూడా పతంగిలు తయారు చేశాను. ఆ పతంగీలు ఎక్కించాను కూడా.

పతంగిలి ఎక్కియ్యడానికి మాంజా తయారు చేసుకునేది. సీసా వక్కలు పగలగొట్టి అన్నము పసుపు కలిపి దారానికి పూసేది. అది మాంజా దారం అయ్యేది. పతంగులు కొన్ని తెగి పడుతూ ఉంటే పోయి తెచ్చుకునేది. పతంగులు ఎక్కిస్తూ ఉంటే చాలా దూరం పోయేది. కొన్ని పతంగులు గిరికీలు కొట్టేది. కొన్ని పతంగిలు పైకి ఎగిరేది. కట్లు కొట్టేది. పెయిన్ చేసేది. పెద్ద పెద్ద పతంగులు కూడా ఎగిరిఛేధి. ఒక చిన్న పేపర్ కు రంద్రం చేసి పతంగి దారాని దాని రంధ్రం నుంచి పెట్టి ఆ పేపర్ను పతంగి వరకు పంపేది. పతంగుల ఆట చాలా ఆనందాన్ని ఇచ్చేది. బాల్యం ఆనందంగా గడిచింది. ఇది రాయడానికి నాకు గంట సమయం పట్టింది. ఇప్పుడు నాకు ఓపిక లేదు నేను తర్వాత మళ్లీ మీకు కలుస్తాను. ఇట్లు మీ రవికుమార్.




 
 
 

Recent Posts

See All
PART6 A SOLDIER నా జీవిత కథ

భూమి మీదికి ఎందరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. జీవితాన్ని గడిపితే మంచిగా గడపాలనుకుటారు. కానీ ఎవరి జీవితాలు మంచిగా గడుస్తున్నాయి పైకి కనబడేవి...

 
 
 
Part 5 A SOLDIER story నా జీవిత కథ

నా 54 ఏళ్ల జీవిత కథ లో మొదటి ఉద్యోగం ఆర్మీ ఉద్యోగం.నేను ఆర్మీ 21.4.1991 న జాయిన్ అయ్యాను. దానికి ముందు నేను నా బాల్యాన్ని హుజురాబాదులో...

 
 
 
PART4 ASOLDIR story.

నేను తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక తెలుగువాన్ని. నేను నా జీవిత కథను రాస్తున్నాను. నా చిన్ననాటి కోరిక సోల్జర్ అయి ఏ విధంగా...

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Post: Blog2_Post

9347151296

  • Facebook
  • Twitter
  • LinkedIn

©2024 by Ravistar. Proudly created with Wix.com

bottom of page