top of page

PART4 ASOLDIR story.

  • Writer: saidurga26366
    saidurga26366
  • Jun 24, 2024
  • 3 min read

నేను తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక తెలుగువాన్ని. నేను నా జీవిత కథను రాస్తున్నాను. నా చిన్ననాటి కోరిక సోల్జర్ అయి ఏ విధంగా నెరవేర్చుకున్నాను అన్ని దశలను రాస్తున్నాను. నేను ప్రస్తుతానికి ఒక్క ల్యాబ్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను.

ఇప్పుడు నా వయసు 54 సంవత్సరంల ఆరు నెలలు. నా పుట్టినరోజు డిసెంబర్ 6 th 1969. ఇప్పటివరకు రాసిన కథలలో నా బాల్యం గడుస్తున్నది. నా ఊరు సూరారం కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఉన్నది. నేను ప్రస్తుతానికి నివసిస్తున్నది బాసర గ్రామము నిర్మల్ డిస్ట్రిక్ట్. మాకు ఉన్న వ్యవసాయంలో ఎక్కువగా మా తాత చేసేది.

మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగం హెల్త్ డిపార్ట్మెంట్లో ఎల్డి కంప్యూటర్ గా చేసేవాడు. మేము నలుగురం అన్నదమ్ములము.నేను పెద్దవాడిని. మా తమ్ముళ్ళతో చిన్ననాడు ఆడుకునే వాన్ని. మా తమ్ముడు ప్రవీణ్ తో ఎక్కువ ఆడుకున్నాను. బాణాల ఆట ఆడేవాన్ని. గోలీల ఆట ఆడేవాణ్ణి. మామిడి పిక్కల ఆట ఆడేవాన్ని. డబ్బాలు ఏసి కుంటు కుంటు పోవాల్సిన ఆట ఆడేవానిని. చిన్నప్పుడు మా తమ్ముడు అంటే నాకు కోపం ఉండేది. వాడు చిన్ననాడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది. నాకు అంతగా మాట్లాడడం రాదు.

మా తమ్ముడిని నాన్న చిన్నప్పుడు బాగా మెచ్చుకునేది .వారిని ఎత్తుకునేది. నాకు అది నచ్చేది కాదు. నన్ను ఎత్తుకుడేంది అని అనుకునేది. అందరికంటే చిన్న తమ్ముడు వినయ్ కుమార్ బాగా మమ్మల్ని నవ్విచ్చేది. నా బాల్యము సూరారంలో గడుస్తున్నప్పుడు మా చిన్న తమ్ముడు పుట్టాడు.

అప్పుడు నేను నాలుగో తరగతి చదువుతున్నాను. మా ఇంట్లో ఉయ్యాల ఉండేది. ఉయ్యాల ఊగే వాళ్ళం. మా తమ్ముళ్ళను మా అమ్మ ఉయ్యాలలో పడుకోబెట్టేది. నేను మా తమ్ముళ్ళను ఉయ్యాలలో ఊపేది. వ్యవసాయ భూమి గాడికి మా తమ్ముళ్ళు ఎప్పుడు నాతో రాలేదు. మా పొలంలో ఒక మొరన్ గుట్ట ఉండేది. ఆ గుట్ట మీద చిన్నపాటి గుట్ట మీద కంచే వుండేది. మా పొలంలో ఎక్కువగా వరి వేసేది. కంకి వేసేది మిర్చి వేసేది కూడా. నా చిన్ననాడు నేను ఒకసారి పొలంలో కంకి చెట్లకు మందు వేశాను. యూరియా వేశాను. అది నాకు గుర్తు. చేతిలో ఎండకు యూరియా కరిగిపోయేది. మా మేనత్త పొలం కూడా మా పొలంతో పాటే ఉండేది. మా మేనత్త పేరు రాజక్క. తనే ఎక్కువగా వ్యవసాయం చూసుకుంటూ ఉండేది మా నాన్న ఉద్యోగానికి పోయేది మా చిన్నాన్న హుజురాబాద్ ల టైలరింగ్ చేసేవాడు.

మా చిన్నాన్న నేను శంకరన్న అని పిలిచేది. ఈరోజు తెల్లవారి నాలుగు నర గంటలకు లేచి వ్రాస్తున్నాను ఈ కథను. మా చిన్నమ్మ ఈరోజు రాత్రి నాకు కలలో వచ్చింది. కలలో నేను ఏదో ఊరికి పోతున్నాను అయితే మా చిన్నమ్మ నన్ను తిన్నమని కూడా అనలేదు. మా తమ్ముడు హరికిషన్ మా చిన్నాన్న కొడుకు నన్ను కలలో తిని పో అని అంటున్నాడు. వాడు ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని పిల్లలతో హుజురాబాద్ లో టైలరింగ్ చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు.

నా చిన్ననాడు ఒకసారి మా నాన్నతో మా చిన్నాన్న తో మా తాతతో కలిసి కంకులను వేడి చేసుకుని కాల్చుకొని తిన్నది గుర్తు. మా చిన్నాన్న మా నాన్న మా తాతతో అంటున్నారు కదా ఈ పొలాన్ని అమ్మేసి మనం వ్యవసాయం మానేద్దాము అని అంటున్నారు అది నాకు గుర్తు. కానీ మా తాత ఏనాడు మా నాన్న మాటలు మా చిన్నాన్న మాటలు పట్టించుకోలేదు. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ భూమిని అమ్మను అని అనేవాడు. నా వ్యవసాయ భూమిని అమ్మను అని అనేవాడు. మా తాత స్వాతంత్ర సమరయోధుడు. తను ఒక్కడే ఒకే ఒక్కడు. మా తాతకు అన్నదమ్ములు గాని అక్క చెల్లెలు గాని ఎవరు లేరు .

మా తాతమ్మకు ఒకే ఒక కొడుకు. మా తాత మ్మ ను నేను అనేది కదా అవ్వ అనేది. మా అవ్వ పేరు రామలక్ష్మి. అందరూ అనేది రామలొచ్చి అని. తను 95 ఏళ్ల పైననే బ్రతికింది.

మా ఇంటి ముందు ఒక కొట్టం ఉండేది అందులో మా మా అవ్వ ఉండేది. మా తాతమ్మ రామలక్ష్మి. ఊరికే పడుకోవడానికి ఒక మంచం మాత్రమే ఉండేది. ఒకసారి బాగా వర్షం వస్తున్నది . మా నాయన మా చిన్నాన్న కలిసి ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోబెటారు. మా తాతమ్మ దేవుని చెప్పేది. అందరూ ఊర్లో వాళ్ళందరూ మా తాత మ్మ ను పండుగలు చేసుకోవడానికి ఏదైనా కష్టం వచ్చినా వచ్చి మా తాతమ్మ దగ్గర దేవుని చెప్పించుకుని అడుగుకొని పోయేవారు. మా తాతమ్మకు కొమరవెల్లి దేవుడు వచ్చేవాడు.

మా తాతమ్మ అదే మా అవ్వ దేవుని పాట పాడుకుంటూ చెప్పేది. మా తాతమ్మకు అదే మా రామ లచ్చమ్మకు చిన్ననాడే భర్త చనిపోయినాడు. తను వచ్చి వాళ్ళ తమ్ముళ్ల దగ్గర అన్నల దగ్గర బ్రతికింది. వాళ్ల తమ్ముళ్లు అన్నలు ఇచ్చిన భూమిని మా తాత వ్యవసాయం చేసిండు. వాళ్ల అమ్మానాన్నలను తను దగ్గర ఉంచుకొని చిన్ననాడు చూసినందుకు పొలం ఇచ్చిండ్లు. మా తాత ఎప్పుడు వాళ్ళ మామలను గుర్తు చేసుకుంటూ ఉండేది .

మా పొలానికి ఎరువుగా మా ఇంటి వెనకాల ఉన్న పెంట కుప్పలు మా తాత బండిలో వేసి తీసుకెళ్లి ఎరువుగా వేసేది.మాకు ఎడ్లు ఉండేది .బర్లు ఉండేది. ఆ కొట్టంలో కట్టేది .నేను వాటికి గడ్డి వేసేది.సాయంత్రం ఎడ్లు బర్ల్ ఇంటికి వచ్చాక. ఆ పోలము పక్కనే మాకు వరుసగా ప్రభాకర్ తాతది, కొండయ్య తాతది రాజయ్య దాతది పొలం ఉండేది. వాళ్ల నాన్న వీరమల్లు. వాళ్ల బాయి దగ్గరికి వెళ్లి అక్కడ కూడా వాళ్లకు ఒక మోరం చిన్న గుట్ట ఉండేది .గుట్ట పైన ఆడుకునేది. వాళ్ల బాయ్ దగ్గర జామ చెట్లు ఉండేవి. మా బాయికాడికి వంటలకు పోయేది .అందరూ వాడ వాళ్ళందరూ కూడా వంటలకు వచ్చి వండుకొని తిని సాయంత్రం మళ్ళీ తిరిగి పోయే వాళ్ళం.

మా తాత కళ్ళు తెచ్చేది కళ్ళు తాగేది నేను చిన్నప్పుడు కూడా. నేను పెద్ద పెరిగాక పెళ్లి కాక ముందుకు అందరం కలిసి ఆ వ్యవసాయ భూమికి వంటకు పోయినం. ఆ బాయిలో పైనుండి దునికి ఈత కొట్టిన. నేను పైనుండి దునికేది నాన్న చూస్తున్నాడు అక్కడనే పక్కనే గట్టు పైన కూర్చున్నాడు. ఆ రోజు వర్షం వచ్చింది వర్షంలో అందరం తడిసిపోయిన ము.

ఇంతటితో ఈరోజు కథను ఆపేద్దాం అనుకుంటున్నా. రేపు మళ్లీ కలుసుకుందాం ఈరోజు24.6.2024

మీ రవి కుమర్.D.M.E.

 
 
 

Recent Posts

See All
PART7. ఒక సైనికుడి జీవిత కథ

నేను ఈ కథ రాయల వద్ద అని అనుకుంటూ కాలం గడుపుతున్నాను 15 రోజులు నుంచి. ఈ కథలో చాలా విషయాలను దాచి పెడుతూ కథ రాయాల్సి వస్తుంది అలాంటప్పుడు...

 
 
 
PART6 A SOLDIER నా జీవిత కథ

భూమి మీదికి ఎందరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. జీవితాన్ని గడిపితే మంచిగా గడపాలనుకుటారు. కానీ ఎవరి జీవితాలు మంచిగా గడుస్తున్నాయి పైకి కనబడేవి...

 
 
 
Part 5 A SOLDIER story నా జీవిత కథ

నా 54 ఏళ్ల జీవిత కథ లో మొదటి ఉద్యోగం ఆర్మీ ఉద్యోగం.నేను ఆర్మీ 21.4.1991 న జాయిన్ అయ్యాను. దానికి ముందు నేను నా బాల్యాన్ని హుజురాబాదులో...

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Post: Blog2_Post

9347151296

  • Facebook
  • Twitter
  • LinkedIn

©2024 by Ravistar. Proudly created with Wix.com

bottom of page