
Part 5 A SOLDIER story నా జీవిత కథ
- saidurga26366
- Jun 30, 2024
- 2 min read
నా 54 ఏళ్ల జీవిత కథ లో మొదటి ఉద్యోగం ఆర్మీ ఉద్యోగం.నేను ఆర్మీ 21.4.1991 న జాయిన్ అయ్యాను. దానికి ముందు నేను నా బాల్యాన్ని హుజురాబాదులో సూరారంలో హనుమకొండలో గడిపాను. ఈ మూడు ప్రదేశాలు తెలంగాణలో ఉన్నవి. వరంగల్ దగ్గరగా ఉన్నవి. ప్రస్తుతానికి నా కథ సూరారం అనే విలేజ్ లో నడుస్తున్నది చిన్ననాడు ఏమి చేశాను ఏం మాట్లాడాను ఎవరితో ఉన్నాను అనేది చెబుతున్నాను.
మా పొలం ఉండేది వ్యవసాయం చేసేది మా తాత .మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు మా బాబాయి టైలరింగ్సేవాడు అందరం కలిసి ఉండేది మా బాబాయికి అప్పుడు పిల్లలు లేరు పెళ్లి అయింది మాకు నా తమ్ముళ్ళను ఉయ్యాలలో వేసి ఊపేది.
ఎక్కువగా మా తమ్ముళ్ళలో ప్రవీణ్ నాతోటి ఆడుకున్నాడు నా మొదటి తమ్ముడు ఆటాడేది.
చింత చెట్ల కింద యాప చెట్ల కింద ఆడుకునేది చెట్లు ఎక్కేది దిగేది.. భూమి పైన నీళ్లు పోసి నీళ్ల తడితో డబ్బాలు గీసి ఆ డబ్బాలలో ఆడేది. చిర్రగోని గోళీలు బాణాలు మామిడి పిక్కలు తో ఆడే ది.
సూరారంలో నా ఫ్రెండ్స్ రఘువీరు మా ఇంటి దగ్గరనే ఉండేది వాళ్ళ తమ్ముడు మహేందరు ఉండేది ఇంకొక చిన్న తమ్ముడు యాదగిరి ఉండేది వాళ్ళ ఇంటికి పోయి జామ చెట్టు ఎక్కి జామాకులు తెంపుకొని జామాకులలో చింతపండు పెట్టి పాను చేసుకునేవాళ్ళం.
వాళ్ల ఇంటి దగ్గరనే చాలోల శ్రీను ఉండేది. అతను కూడా మా తోటి ఆడేది. పాపం వాడు భీమండిలో ఉద్యోగం చేస్తూ ఎయిడ్స్కు గురై చనిపోయినాడు. ఇప్పుడు ఆ రఘువీరు ఎన్ ఎఫ్ సి కంపెనీ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. మహేంద్ర మెడికల్ ఫీల్డ్ లో మెడికల్ ఏజెన్సీ తీసుకుని డబ్బు సంపాదించుకుంటున్నాడు. మనిషికి డబ్బు చాలా ముఖ్యం డబ్బు లేకపోతే మనసు జబ్బుల పడిపోతాడు. మనిషికి ధైర్యం డబ్బే.
ఏ పని చేసినా చివరికి డబ్బే కావాలి డబ్బు రూపంలోనే చివరికి మనసుకు తృప్తినిస్తుంది. డబ్బు మనిషిని సమాజంలో నిలబెడుతుంది డబ్బు లేకపోతే మనిషిని సమాజంలో అడుగు స్థాయిలో ఉంచుతుంది. చివరికి ప్రేమ కొరకు కూడా డబ్బే కావాలి. డబ్బు మనిషిని బతికిస్తుంది చంపేస్తుంది. డబ్బుతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కాలం కరిగిపోతూ ఉంటుంది కాలంతో డబ్బును పెంచుకుంటూ పోవాలి. పెంచకున్న .....జాగ్రత్తగా దాచుకోవాలి.
ఇ ప్పుడు మా తమ్ముళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నారు. నా చిన్ని తమ్ముడు ఏ పని చేయక ఇంట్లోనే తినీ పడుకోవడం తిరగడం చేస్తున్నాడు చెప్తే మాట వినడు తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాడు అందరి పైన అందరినీ బాధ పెడతాడు. నా ఇద్దరి తమ్ముళ్లు హైదరాబాదులో ఉంటున్నారు. నా మ్యారేజ్ అయిన తర్వాత ఆర్మీ ఉద్యోగం చేసినాను నా కొడుకు 1996లో జన్మించినాడు. నా కొడుకు ఇప్పుడు ఎం డి ఎస్ చదువుతున్నాడు. నా తమ్ముళ్లు ఇద్దరు పెద్దతమ్ముళ్ళు హైదరాబాదులో ఉంటున్నారు. నా తరువత ఇద్దరు తమ్ముళ్లకు మ్యారేజ్ అయింది చిన్న తమ్మునికి మ్యారేజ్ కాలేదు. నేను ప్రస్తుతానికి lab assistant ఉద్యోగం బాసరలో Rgukt లో mechanical department lo చేస్తున్నాను.. నాకు గవర్నమెంట్ క్వార్టర్ ఇచ్చింది. క్వార్టర్ లో ఉంటున్నాను. నా బార్య టైలరింగ్ చేస్తూ ఉంటుంది. నా భార్య తమ్ము డు వరంగల్లో ఉంటున్నారు.. మా తమ్ముని కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాడు బిడ్డ న్యూట్రిషన్ జాబ్ చేస్తుంది హైదరాబాదులో. నా కొడుకుకు మ్యారేజ్ అయింది భార్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా అమ్మానాన్నలు అనుమకొండ లో ఉంటున్నారు. మా చిన్న తమ్ముడు అమ్మనాన్నలతో ఉంటాడు. ఇప్పుడు ఇక రాయబోయే కథల్లో జీవితంలో చిన్న నాడు చదువుకున్న నాడు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు జరిగిన నా జీవితంలోని విషయాలు వివరిస్తాను. సెలవా మరి ఇట్లు మీ రవికుమార్ . ఫోటోలో క్యాప్ పట్టుకొని మా ఫ్రెండ్ వీరాంజనేయరెడ్డి పక్కన నిలబడ్డది నేనే.

Comments