PART6 A SOLDIER నా జీవిత కథ
- saidurga26366
- Jul 2, 2024
- 2 min read
భూమి మీదికి ఎందరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. జీవితాన్ని గడిపితే మంచిగా గడపాలనుకుటారు. కానీ ఎవరి జీవితాలు మంచిగా గడుస్తున్నాయి పైకి కనబడేవి అన్ని కూడా సినిమాలోని హీరోలా ఉంటాయి. కొందరి జీవితాలు బాధలు పడుతూ ఉంటారు .అందరి జీవితాలకు బాధలు వచ్చిపోతూ ఉంటాయి .కొందరు ధనవంతులుగా బతుకుతారు .కొందరు పేదవారుగా బతుకుతారు. మనసు సంతోషంగా ఉంటే ఎన్ని బాధలైనా భరించవచ్చు కానీ బాధలను తట్టుకో నీ నిలబడడం జీవితంలో గొప్పనైన విషయం.
బాధలు మానసికంగా ఉండవచ్చు శారీరకంగా ఉండవచ్చు. చిన్ననాడు బాధలు ఒక రకంగా ఉండవచ్చు. యవ్వనంలో బాధలు ఇంకో రకంగా ఉంటాయి. ముసలి వారి బాధలో ఇంకో రకంగా చెప్పలేక పోతాము. ఇవి అన్ని మనము జీవితంలో చూస్తూనే ఉన్నాం. జీవితాన్ని చూస్తూ ఉంటే మనకు జరిగేవన్నీ అనుకున్నవి జరగాలని లేదు. అనుకోనివి జరగకుండా ఉండవు.
కాలం గడుస్తూనే ఉంటుంది మళ్ళీ తిరిగి రాదు. చదువుకున్న చదువు తిరిగి వస్తుంది మనసుపెట్టి చదువుతే డబ్బు రూపంలో మన చేతిలో ఉంటుంది. కాలం మాత్రం ఒకటే పేదవారికైనా ధనవంతునికైనా కాలం మాత్రం ఒకటే. ఉపయోగించుకునే రీతిలో ఉపయోగించుకుంటే అదే మనకు సంతోషాన్ని ఇస్తుంది. సినిమా చూడడానికి వెళ్లి కొట్లాడుకుంటే పైసలు వేస్ట్ కాలము వేస్ట్.
మనము ఈ భూ ప్రపంచం మీద సినిమా చూడడానికి వచ్చాము కానీ కొట్లాడుకోడానికి కాదు ఏ వయసులో జరగాల్సిన పనులు ఆ వయసులో సంతోషంగా చేసుకుంటూ పోతుంటే జీవితానికి సాఫల్యం ఉంటుంది.
సూర్యుడు ఉదయిస్తున్నాడు సాయంత్రం అయితే పడమటిలో అస్తమిస్తున్నాడు జరగాల్సిన పనులు జరుగుతూ ఉన్నవి కానీ పనులు కాకుండానే పోతుంది ఒక్కోసారి. ఎదురుచూస్తూ కూర్చుంటే కాలం గడిచిపోతుంది కానీ చేతనై మనసు పెట్టి చేస్తే ఫలితాన్ని పొందుతాం. అదే నా చిన్ననాటి కోరిక నేను ఆర్మీలో జెయిన్కావాలని ఆర్మీలో జాయిన్ అయ్యాను .అది ఎప్పుడు 21 ఏప్రిల్ 1991. దానికి ముందు జీవితంలో నేను ప్రైమరీ స్కూల్ సూరారం లో చదివాను హైస్కూల్ హుజూరాబాద్ లోచదివాను .ఇంటర్మీడియట్ హుజురాబాద్ చదివాను. డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఆదిలాబాద్ లో చదివాను. సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వరంగల్లులో చదివాను. ఆర్మీ ఉద్యోగం చేయాలని కోరికతో డిప్లమా అయిపోయినాయక మ్యారేజ్ అయినాక నెల రోజుల తర్వాత ఆర్మీలో జాయిన్ అయ్యాను.
ఈ కథని ఎందుకు రాస్తున్నాను అంటే నాకు నేను గత జీవితాన్ని గుర్తు తెచ్చుకోవడానికి రాసుకుంటున్నాను చదివిన వాళ్లు పొందే ప్రేరణ పొందవచ్చు లేకపోతే పొందకపోవచ్చు .చదివి ఊరికే ఊరుకుండవచ్చు నాలోని మంచి విషయాలను చెప్పాలనుకుంటున్నాను. నేను ఎన్నో సినిమాలు చూశాను ఎన్నో ప్రదేశాలు తిరిగాను ఎన్నో ఎందరితోటోమాట్లా డాను .ఎందరితోటో సంతోషాన్ని అనుభవించాను ఎందరితోటో బాధలు అనుభవించాను .ఉద్యోగంలో బాధలు అనుభవించాను .ఇంట్లో బాధలు అనుభవించాను .తల్లిదండ్రులతో సంతోషాన్ని బాధలు అనుభవించాను తమ్ముళ్ళతో సంతోషంగా బాధలు అనుభవించాను. భార్యలతోటి సంతోషాన్ని బాధలు అనుభవిం చాను. కాలం గడిచిపోతున్నది నాకు ఇప్పుడు ముసలితనానికి మొదటి దశలో ఉన్నాను. ప్రస్తుతానికి నాకు సొంత ఇల్లు అంటూ ఏమీ లేదు. చేతిలో డబ్బు ఏమీ లేదు. ఉద్యోగం అయితే చేస్తున్న అవి ఖర్చులకే సరిపోతున్నాయి.
ముందు జీవితం పైన నమ్మకం ఉన్నది మంచిగా బతుకుతాను అదే నాకు కొండంత ఆశ ఆ దేవుని ధైర్యం. నా జన్మదినం డిసెంబర్6, 1969. ఇంతటితో ఈరోజు ముగిస్తున్నాను మళ్ళీ కలుసుకున్నప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఇట్లు మీ రవి కుమార్.

Comments