PART 2 A SOLDIER. నా జీవిత కథ.
- saidurga26366
- Jun 22, 2024
- 1 min read
నేను ఈ కథ రాస్తూ ఉంటే నాకు అన్ని గుర్తుకు వస్తున్నాయి.నా చిన్నప్పుడు నేను వర్షం పడుతూ ఉంటే ఇంటి ముందు వరద పోయేది.అనీళ్ళల్ల నేను ఆడు కునేది .కట్టలు కట్టేది.తూములు చేసేది.ఔసులొల్ల ఇంటి ముందు దోస్తుల తోటి నీళ్ళల్ల ఆడుకునేది.
స్నేహితుడు రఘువీర్ తోటి మా తమ్ముడు ప్రవీణ్ తోటి ఆయన తమ్ముడు మహేందర్ తోటి ఆడుకునేది నీళ్ళ తోటి అదే వరద నీటి తోటి.బట్టలు తడిసి పోయేది. పడవలు చేసి నీళ్ళల్లో ఆదుకునేది.కత్తి పడవలు చేసేది.పేపర్ తోటి.బట్టలు నానేది.తడిసి పోయేవాళ్ళం.ఒకరోజు మానాన్న నన్ను నీళ్ళల్లో ఆడుతఉంటే మాఇంటిముందు చేయి పట్టుకొని తీసుక పోయింది గుర్తు. అప్పుడు మాఇంటి ముందు శంకరయ్య పెదబాపు ఎందుకు తీసుక పోతున్నావ్ మంచిగా ఆడుకుంటాండు అన్నాడు అది నాకు తెలుసు.ఇంకా గుర్తు ఉన్నది.ఇంకా చిన్నప్పుడు చందువుకునే టప్పుడు పేపర్ తో పంచపాల చేసే వాళ్ళం.అది చేయి వే ళ్ళకు తొడిగే వాళ్ళం.ఒక్కోసారి వర్షంలో స్కూలుకు కూడా పోయేవాళ్ళం.మా బడి కచ్చేరు కాడ ఉండేది.మాటీచేర్ పేరు రామకృష్ణమ్మ.మాకు చందువు బాగా చెప్పేది.ఆమె భర్త మాకు కోదండం ఎక్కిచ్చే వాడు.కోదండం అంటే రెండు తాళ్ళు వేలాడ తీసేవాళ్ళు .చదువని వాళ్ళను ఆతాళ్ళకు చేయి తో వెలాడ తీసే వాళ్ళు.కాళ్ళ వెళ్ళకు మాగ్నెట్ షాక్ ఇచ్చిండు ఒకసారి.
మేము స్కూల్. ని కానీ బడి అనేవాళ్ళం.కానీ బడి లో నీడలను చూసుకొని ఇంటి బెల్ అయితాంధి ఇంటికి కాసేపు అయ్తే పోతాము అని అనుకునే వాళ్ళం.అందరం కింద కూర్చునే వాళ్ళం.నిక్కర్ షార్ట్ వేసుకుని పోయేవాళ్ళం.ఆప్పుడు స్కూల్ లో సాయంత్రం అయితే పాటలు పాడిపిచ్చేది . ఆపాట ఇంకా గుర్తు ఉన్నది".పాం పామ్ మోటార్ పంపు కొట్టు మోటార్ డిల్లీకి పోదాం ఇందిరా గాంధీ నీ చూద్దాం " అని పాడేది.అందరం స్కూల్ బయట గుండ్రంగా నిలబడే వాళ్ళం.ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నిలబడే వాళ్ళం.అక్కడ ఒక చెట్టుకు పోస్ట్ డబ్బా కట్టి ఉండేది.దాంట్లో ఉత్తరాలు వేసే వాళ్ళు. నేను కూడా ఒకపేపర్ మీద ఉత్తరం వ్రాసి అడ్రస్ లేకుండ్ పోస్ట్ డబ్బలో వేసాను.నేను మా అక్కకు హనుమకొండ లో ఉంటది తను 5వ తరగతి చదువుతోంది అనుకుంట నేను 3వ తరగతి చదువుకుంటున్న ఉత్తరం వ్రాసాను.పోత్చేసాను అదే డబ్బాలో.

Comments