PART3 ASOLDIR.
- saidurga26366
- Jun 23, 2024
- 2 min read
నా చిన్నప్పుడు మా ఊరు లో మేము ఆటలు బాగా ఆడు కునే వాళ్ళం.గోళీల ఆట , మామిడి పిక్కల ఆట ,బాణాల ఆట, కోతి కొమ్మ ఆట ,వర్షాకాలం లో శీకు లాట,డబ్బాల ఆట ,బాయిల్లా కు పోయి ఈత కొట్టాలని ప్రయత్నం చేయడం,చెరువుల ఈత కొట్టడం చేసేది.
సాయంత్రం అయితే మాఇంటిముందు అందరం ఆటలు ఆడేది.మాతాత పాటలు పాడేది.అందరూ మాఇంటిముండు మాతాత పాటలు వినేది.
సాయంత్రం స్కూల్ అయ్యాక మా అమ్మ మమ్మల్ని బుక్స్ పట్టి చదివించేది నాకు గుర్తు.మా తమ్ముడు ప్రవీణ్ నేను పక్క పక్కన కూర్చునేది.సాయంత్రం అయితే ఇంట్లో దీపాల వెలుగు ఉండేది.ఆపట్ల ఇంట్లో కరెన్ట్ ఉండక పోయేది .ఇంట్లో కిరోసిన్ దీపాల వెలుగులో ఉండేది.వాడ లో ఒక వీధి స్తంభానికి కరెంట్ బల్బ్ వెలిగింది.సాయంత్రం ఆవెలుగు లో ఆటలు ఆడేది.
మా అమ్మ మాకు చదువు చెప్పింది నాకు గుర్తు.మాచిన్నమ్మ కూడా నాకు చదువు చెప్పింది.మా నాన్న సైకిల్ ను నేను చిన్నపుడు తొక్కేది .అసైకిల్ మీదనే నేను కాంచి,సీట్ నేర్చుకున్న.మానాయిన సైకిల్ కడిగేది నాకు గుర్తు.నేను సైకిల్ కాంచీ తొక్కడం నేర్చుకున్నది నాకు నేనే.నాకు ఎవ్వరూ నేర్పలేదు.ఒక కాలు తో తొక్కి తొక్కి రెండో కాలు గూడ వేసే వానిని పైడల్ పైన.అది పోతుంటే మజా అనిపించేది.మా వాడ లా చివరి వరకు పోయి సైకిల్ మీద మళ్ళీ ఇంటి దాకా తిరిగి వచ్చేది.అక్కడనే చక్కర్లు కొట్టేది.కానీ ఊరంత తిరుగక పోయేది.సీట్ తొక్కుతూ ఉంటే సైకిల్ గాలిలొ పోతున్నట్టు అనిపించేది.మా ఇంటి ముందు ఒక గద్దె ఉండేది . గద్దె మీద మా అవ్వ మాఅవ్వ స్నేహితులు కూర్చునేది.సాయంత్రం అయితే ముచ్చట్లు పెట్టేది.
వర్షాకాలంలో మాఇంట్ల పాలాలు ఎంచేది .అవి తినేవాళ్ళం.అందరూ మాఇంట్లో మా వాడల ఉన్న ఏలూమొల్లు మా నాన్న తోటి, మాతత తోటి వ్యవసాయం ముచ్చట్లు పెట్టేది.నేను విను కుంటూ ఉండేవాణ్ణి.వర్షం పడుతూ ఉండేది.వాళ్ళు ముచ్చట్లు పెడుతూ ఉండే వాళ్ళు.మాఇంటి మీద ఒక దొని ఉండేది.ఆదోని నుండి వర్షం నీళ్ళు పడి ఒక చిన్నపాటి లోంద అయ్యేది.మాఇంటి ముందు అంతా వరద నీరు ఉండేది. ఆ వరద నీటిలో ఆడుకునేది. మా ఇంటి దగ్గర యాప చెట్టు పెద్దది ఉండేది. ఆ యాప చెట్టు కింద ఒక పెద్ద బొంద ఉండేది .ఆ బొందలో వర్షపు నీరు ఉండేది . సాయంత్రం అయితే కప్పలు బెకబెక అని అరిచేది. అది అంతా నాకు వినబడేది. ఎండాకాలంలో ఆ యాప చెట్టు కింద మేము యాప పండ్లు ఏరుకునేది అవి తినేది .ఆ యాప చెట్టు కింద మేము ఆడుకునేది. ఆ యాప చెట్టు ఎక్కాలని ప్రయత్నం చేసేది కానీ అది చాలా లావైన ఎత్తైన పెద్ద చెట్టు. ఆ యాప చెట్టు ఎక్కలేకపోయేది.
మా ఇంటి వెనకాల ఒక చింత చెట్టు ఉండేది. కానీ మేము ఆ చింత చెట్టు ఎక్కి చింతకాయలు కోసుకునేది. చింతకాయలకు ఉప్పు పెట్టి తినేది. మాకు పొలంలో మామిడి చెట్టు ఉండేది మామిడికాయలు ఎక్కి తెంపుకునేది. మా మామిడి చెట్టు తీయని మామిడికాయల చెట్టు అదే తొక్కు పెట్టుకోవడానికి వీలుగా ఉండేది కాదు. ఆ చెట్టుతో మాకు ఎతో అనుబంధం ఉండేది. మా ఊరికి పోతే పొలంలో మామిడి చెట్టు ఎక్కి మామిడికాయలు తెంపుకునేది. మా పొలంలో ఒక చింత చెట్టు కూడా ఉండేది ఒక కుంకుడుకాయ చెట్టు కూడా ఉండేది. మా బాయి కరెంటు ఆన్ చేసి నేను తొందరగా పోయి నీళ్లలో నిలబడేది ఆ నీళ్లు పోతూ ఉంటే నాకు గులగుల పెట్టేది. అది అంతా సంతోషంగా ఉండేది.
మా బాయ్ చుట్టూ చెట్లు ఉండేది చెట్లకు పిట్టలు గూడు కట్టేది అది నేను చూసి చాలా ఆశ్చర్యపోయేవాన్ని .రంగురంగుల పిట్టలు వచ్చేది. మళ్లీ రేపు కొన్ని ముచ్చట్లు పెట్టుకుందాం
From Ravikumar.

Comments