బ్రతుకు బండి
- saidurga26366
- Jun 12, 2024
- 1 min read
ఈ ప్రయాణం ఎంతకాలం నాకు తెలువది.
నీకు తెలుసా?
బ్రతుకు బండి సాగేవరకు మనం ఎక్కడికైనా పోతాము.
అది ఏ కాలమైనా కానీ.
నడుస్తూన్న కాలం మంచిది ఐన కాకపోయినా పోతూనే ఉంటుంది బ్రతుకు బండి.
మనసును ముడివేస్తే బ్రతుకు బాధలు లేకుంట ఉంటది.
లేకుంటే ఒంటరి ప్రయాణం.
ఈ ప్రయాణం లో ఎన్నో సంతోషాలు బాధలు కన్నీళ్లు కొందరికి తప్పకుంట ఉంటాయి.
మనసు మాట వినండి.అది చెబుతూనే ఉంటుంది.
కాలం కాటేస్తుంది జాగ్రత్త.
మందు పెట్టి ముందుకు పోవడమే మంచిది.
మనకోరికలు తీరెవరకు.
ప్రయత్నం రోజుకింత చేయండి అది ఒకప్పిటికి గుట్ట అయి ముందు ఉంటుంది.
నేతెలివే నీ ఆయుధం.
ఒదిగి ఉండు . వినయంతో ఉండు.నీ ప్రయాణం ఎంతో విలువైనది.
దేవుని నీడలో అంటే దేవుణ్ణి స్మరిస్తూ ఉండు
నీప్రయత్నం చేస్తూ ఉండు.
నీవు కోరుకున్న ఫలితం వచ్చే వరకు.
ఆరోగ్యమే నీ మొదటి కోరిక.
దురలవాట్లకు దూరంగా ఉండు.
దుష్టులకు దూరంగా ఉండు.
స్నేహితులకు దగ్గరగా ఉండు.
ఆపదలో కాపాడిన వారిని మరచి పోకు.
బ్రతుకు బండి సాగే వరకు.
విదివంచనకు గురి ఆయన బ్రతుకులు ఎన్నో.
నీ కంటికి కనబడుతాయి .భయపడకు.
నేదారిలో మోసాలు ఉండ వచ్చు .అదృష్టము ఉండవచ్చు.ఎమైన కావచ్చు భయపడకు.
నీగమ్యం వచ్చే వరకు.
దేవుని నీడలో నీ బ్రతుకు సాగించి తీరు.
డబ్బు ఉండనీ ఉండకపోనీ ధైర్యాన్ని వదలకు.
దేవుణ్ణి వదలకు.
కాలం నడుస్తూనే ఉంటది.
ఆపద రాణి అదృష్టం రాణి దేవుణ్ణి వదలకు.
నీసౌందర్యం పోనీ వయసు పోనీ డబ్బు పోనీ దైర్యం వదలకు.
నీవు ఒంటరి వాడవు కాదు . దేవుడు ఉన్నాడు.నీ బ్రతుకు బండి సాగేవారకు.

Comments